సీఎంగా మీ అందరికీ ఒకే మాట చెబుతున్నా: జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎంగా మీ అందరికీ ఒకే మాట చెబుతున్నా: జగన్

  • ఆకాశమంత విజయాన్ని అందించిన మీ అందరికీ ధన్యవాదాలు
  • మీ అందరికీ నేను అండగా ఉంటా
  • మేనిఫెస్టోలోని అన్ని హామీలను నెరవేర్చుతా
3,648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు, మీలో ఒకడిగా నిలిచినందుకు, ఆకాశమంత విజయాన్ని అందించిన మీ అందరికీ పేరుపేరున ధన్యవాదాలు చెబుతున్నానని ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవిని తాను స్వీకరిస్తున్నానని తెలిపారు.

పదేళ్ల తన రాజకీయ జీవితంలో పాదయాత్రలో ప్రజలందరి కష్టాలను విన్నానని, స్వయంగా చూశానని అన్నారు. కష్టాలను చూసిన తాను సీఎంగా ఒక్క మాట చెబుతున్నానని... మీ అందరికీ తాను అండగా ఉన్నానని చెబుతున్నానని భరోసా ఇచ్చారు. కేవలం రెండే రెండు పేజీలతో, ప్రజలందరికీ ఎప్పుడూ కనిపించేలా మేనిఫెస్టో రూపొందించామని... పేజీలకు పేజీల మేనిఫెస్టో తీసుకురాలేదని అన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా మార్చుతానని చెప్పారు. మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామీలను నెరవేర్చుతానని చెప్పారు. మేనిఫెస్టోనే ఊపిరిగా మీ అందరి కోసం పని చేస్తానని తెలిపారు. అందరికీ మాట ఇచ్చినట్టుగానే నవరత్నాలను నెరవేర్చుతానని చెప్పారు.
jagan
ysrcp

More Telugu News