వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను... పూర్తయిన ప్రమాణ స్వీకారం!
- కొత్త సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
- ఆపై రహస్య ప్రమాణ స్వీకారం
- బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్
"వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగము పట్ల నిజమైన విశ్వాసము, విధేయతా చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అని ప్రమాణం చేశారు.
ఆపై "వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ, ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అని రహస్య పరిరక్షణ ప్రమాణం చేసి, ఆపై సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు సంతకం చేశారు.