జగన్ ప్రమాణస్వీకారం.. పూలవర్షం కురిపించేందుకు సిద్ధమైన హెలికాప్టర్!

  • నేడు నవ్యాంధ్ర రెండో సీఎంగా జగన్
  • మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణస్వీకారం
  • ప్రత్యేక ఏర్పాట్లు చేసిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరపురాని వేడుకగా మలిచేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇందుకోసం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
YSRCP
helicoptor
oath taking

More Telugu News