Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ రోజు రాత్రి కారు ప్రమాదం నుంచి నేను .. బ్రహ్మానందం బయటపడ్డాము: పాకీజా

  • 'అసెంబ్లీ రౌడీ' కోసం చిత్తూరు వెళ్లాము
  • రాత్రివేళ కారులో చెన్నైకి బయలుదేరాము
  •  డ్రైవర్ కునుకు తీయడంతో ప్రమాదం
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాకీజా మాట్లాడుతూ, గతంలో తనకి జరిగిన కారు ప్రమాదాన్ని గురించి ప్రస్తావించారు. 'అసెంబ్లీ రౌడీ' సినిమా షూటింగు కోసం చిత్తూరు వెళ్లాము. అక్కడ నాపై .. బ్రహ్మానందం గారిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగు పూర్తికావడంతో మోహన్ బాబు గారు కారు ఇచ్చి, నన్ను బ్రహ్మానందం గారిని చెన్నైకి పంపించారు.

మేము బయలుదేరేసరికి రాత్రి 9 దాటింది. చీకటిలో ప్రయాణం కదా కాస్త జాగ్రత్త అని డ్రైవర్ కి బ్రహ్మానందం గారు ముందే చెప్పారు. కానీ ఆ డ్రైవర్ కారు డ్రైవ్ చేస్తూనే కునుకు తీశాడు. అంతే కారు వెళ్లి లారీని కొట్టేసింది. ఆ శబ్దానికి బ్రహ్మానందం గారు .. నేను మా పని అయిపోయిందనే అనుకున్నాము. కానీ అదృష్టవశాత్తు మేము బతికి బయటపడ్డాము. ఇప్పటికీ బ్రహ్మానందం గారు .. నేను ఎదురుపడితే ఆ సంఘటననే గుర్తుచేసుకుంటాము" అని చెప్పుకొచ్చారు
vasuki
ali

More Telugu News