Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని నిర్మాతగా మరో సినిమా .. హీరోగా విష్వక్సేన్

  • హీరోగా నాని ఫుల్ బిజీ
  •  సెట్స్ పై రెండు సినిమాలు
  •  త్వరలో నిర్మాతగా మరో మూవీ
ఒక వైపున హీరోగా నాని విలక్షణమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున నిర్మాతగాను చిన్న సినిమాలను నిర్మించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఆ మధ్య ఆయన నిర్మించిన 'అ' సినిమా అంతగా వసూళ్లను రాబట్టలేదు గానీ, ప్రయోగాత్మక చిత్రంగా ప్రశంసలు అందుకుంది.

తాజాగా ఆయన మరో సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. 'ఫలక్ నుమా దాస్' ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన నాని, ఇదే హీరోతో తన సొంత బ్యానర్ అయిన 'వాల్ పోస్టర్'పై ఒక సినిమాను నిర్మించనున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం తాను 'గ్యాంగ్ లీడర్' .. 'వి' సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాననీ, ఈ రెండు ప్రాజెక్టులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత నిర్మాతగా తన తదుపరి సినిమా మొదలవుతుందని అన్నాడు.
nani

More Telugu News