Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు పేరు పెట్టింది ఎంజీ రామచంద్రన్ గారు: నటి పాకీజా

  • నేను పుట్టి పెరిగింది చెన్నైలో 
  • నా అసలు పేరు 'వాసుకి'
  • మా నాన్నగారు ఆయన దగ్గర పనిచేసేవారు
తమిళంతో పాటు తెలుగులోను 'వాసుకి' అనేక చిత్రాల్లో నటించారు. తెలుగులో 'అసెంబ్లీ రౌడీ' .. 'రౌడీగారి పెళ్లాం' వంటి సినిమాలు ఆమెకి ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమె అసలు పేరు 'వాసుకి' అయినప్పటికీ, 'పాకీజా' అనే పేరుతోనే ఆమె పాప్యులర్ అయ్యారు.

తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, "మొదటి నుంచి కూడా నేను చెన్నైలోనే ఉంటున్నాను. నేను పుట్టిపెరిగింది అక్కడే. ఎంజీ రామచంద్రన్ గారు రాజకీయాల్లో బిజీగా వున్నప్పుడు, ఆయన దగ్గర మా నాన్నగారు పనిచేసేవారు. ఆ సమయంలోనే నేను పుట్టానట. దాంతో మా నాన్నగారు నన్ను ఎత్తుకెళ్లి .. నా బిడ్డకి పేరు పెట్టండి అని అడిగితే, ఆయన 'వాసుకి' అని పేరు పెట్టారు. నాకు పేరు పెట్టింది ఆ పెద్దాయన కావడం నాకు గర్వంగా అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.
vasuki
ali

More Telugu News