వైఎస్ జగన్ ని కలిసేందుకు వెళ్లిన నన్నపనేని రాజకుమారి

  • జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నన్నపనేని
  • ఆమె వెళ్లే సరికే తన నివాసానికి వెళ్లిపోయిన జగన్
  • జగన్ ని కలవకుండానే వెనుదిరిగిన నన్నపనేని
వైసీపీ అధినేత జగన్ ని కలిసేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వెళ్లారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసేందుకు ఈరోజు ఆమె వెళ్లారు. అయితే, ఆమె అక్కడికి వెళ్లే సరికే జగన్ తన నివాసానికి వెళ్లిపోయారు. దీంతో, జగన్ ని కలవకుండానే నన్నపనేని వెనుదిరిగారు. కాగా, నన్నపనేని రాజకుమారి కూతురు, అల్లుడు వైసీపీలో ఉన్నారు. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా ఆయన్ని కలిసేందుకే నన్నపనేని అక్కడకి వెళ్లినట్టు తెలుస్తోంది. రేపు ఇడుపులపాయకు జగన్ వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి వచ్చిన తర్వాత జగన్ ని ఆమె కలవనున్నట్టు సమాచారం. 
Go Back to Shorts
Ys jagan
tadepalli
nannapaneni
rajakumari

More Telugu News