‘సాహో’ నుంచి తప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు!
- సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’
- తెలుగు, తమిళం, హిందీలో రూపొందుతోంది
- ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సాహో’
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో ఈ సినిమాకు పెద్ద దెబ్బ తగిలింది. మ్యూజిక్ డైరెక్టర్లు శంకర్-ఎహసాన్-లాయ్ ‘సాహో’ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.