Andhra Pradesh: చంద్రబాబును ప్రజలు నమ్మలేదు: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
- అమరావతి పేరిట ఐదేళ్ల పాటు అబద్ధాలు చెప్పారు
- రైతులను నిలువునా మోసం చేశారు
- జగన్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది
ఏపీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలవడానికి కారణం చంద్రబాబును ప్రజలు నమ్మకపోవడమేనని గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, అమరావతి పేరిట చంద్రబాబు ఐదేళ్ల పాటు అబద్ధాలు చెప్పారని, రైతులను నిలువునా మోసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు హయాంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలేదని, ఫీజు రీయింబర్స్ మెంట్ సౌకర్యం లేక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలందరూ భావించారని, అందుకే, తమ పార్టీకి భారీ విజయాన్ని ప్రజలు అందించారని అన్నారు.