సిక్కిం సీఎంగా తమాంగ్ ప్రమాణస్వీకారం

  • తమాంగ్ తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్  
  • నేపాలీ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన తమాంగ్
  • ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ నేతలు, నాయకులు
సిక్కిం కొత్త ముఖ్యమంత్రిగా ఎస్కేఎమ్ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. గ్యాంగ్ టక్ లోని పల్జోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రేమ్ సింగ్ తమాంగ్ తో గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. నేపాలీ భాషలో తమాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి ఎస్కేమ్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాగా, సిక్కిం శాసనసభలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎస్కేఎమ్ పార్టీకి 17 స్థానాలు రాగా, ఎస్డీఎఫ్ పార్టీకి 15 స్థానాలు లభించాయి.  
Go Back to Shorts
sikkim
gangtak
cm
prem singh tamang

More Telugu News