జగన్ మోహన్ రెడ్డిని కలసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌

  • జగన్‌కు శాలువా కప్పి సత్కరించిన రాంమాధవ్
  • ఎన్నికల్లో గెలిచినందుకు అభినందనలు
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అభినందనలు తెలిపారు. విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాంమాధవ్‌కు జగన్ శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి తాజా రాజకీయ పరిణామాలపై కాసేపు చర్చించుకున్నారు.

అంతకుముందు ప్రధాని మోదీని కలిసిన జగన్ ఈ నెల 30న విజయవాడలో జరగనున్న తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ తర్వాత బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిశారు. కాగా, ప్రధాని మోదీ, జగన్ మోహన్‌రెడ్డి ఇద్దరూ ఒకే రోజున ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే!  
Go Back to Shorts
Ram madhav
BJP
Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News