వీర మహిళలూ మీ భర్తలతో కలిసి యాత్రలకు వెళ్లండి, ఈలోపు మన నాయకుడు కార్యాచరణ రూపొందిస్తాడు: నాగబాబు

  • ఓటమికి నిజంగా బాధపడుతున్నాం
  • బాధ లేదంటే అది అబద్ధం అవుతుంది
  • ఓటమి అనేది ఓ విరామం మాత్రమే
మెగాబ్రదర్ నాగబాబు ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ ఎన్నికల్లో జనసైనికులు, వీర మహిళలు ఎంతో స్ఫూర్తిదాయకంగా పనిచేశారని కితాబిచ్చారు. జనసేన ఓటమి పట్ల బాధపడడంలేదంటే అది అబద్ధం అవుతుందని, నిజంగానే ఎంతో మనస్తాపం చెందామని నాగబాబు తెలిపారు. ముఖ్యంగా, జనసేన వీరమహిళలు బాధపడడం చూసి తమకు ఎంతో విచారం కలిగిందని, కానీ ఓటమి ఎప్పుడూ శాశ్వతం కాదని అన్నారు. ఇదో విరామం మాత్రమేనని, వీర మహిళలు ఓ నెలపాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రజాసేవకు సిద్ధం కావాలని నాగబాబు పిలుపునిచ్చారు. తమ భర్తలతో కలిసి హాయిగా విహారయాత్రలకు వెళ్లి రావాలని, ఈలోపు జనసేనాని కార్యాచరణ రూపొందిస్తాడని తెలిపారు.
Go Back to Shorts
Nagababu
Jana Sena
Pawan Kalyan

More Telugu News