అనంతపురంలో టెన్షన్ టెన్షన్.. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు!
- జిల్లాలోని గార్లెదిన్నె తలదాసిపల్లిలో ఘటన
- 44వ జాతీయ రహదారిపై వైసీపీ ఆందోళన
- పోలీసులు సముదాయించడంతో వెనక్కి తగ్గిన నేతలు
తలదాసిపల్లి మీదుగా వెళుతున్న 44వ నంబర్ జాతీయ రహదారిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, వైసీపీ నేతలతో చర్చించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించిన వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు అందించి వెనుదిరిగాయి.