శ్రీకాకుళంలో తప్పిన పెను ప్రమాదం.. దగ్ధమైన పెళ్లి బస్సు.. 72 మంది సురక్షితం
- బైక్ను ఢీకొన్న పెళ్లి బస్సు
- ద్విచక్ర వాహనదారుడి మృతి
- క్షణాల్లోనే దగ్ధమైన బస్సు
దీంతో వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సులోని 72 మందిని వెంటనే కిందికి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు కిందికి దిగిన క్షణాల్లోనే బస్సు బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.