Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియుడ్ని నడిబజార్లో నిలబెట్టి 52 సార్లు చెంప చెళ్లుమనిపించిన ప్రియురాలు!

  • బహుమతి తీసుకురాకపోవడమే అతడు చేసిన నేరం!
  • రెచ్చిపోయిన ప్రియురాలు
  • ప్రియురాలు కొడుతున్నా కిక్కురుమనని ప్రేమికుడు
"ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం" అని సినీ గేయ రచయితలు ఊరికే రాయలేదు. అందుకు ఈ ఘటనే సరైన నిదర్శనం. చైనాలో ఇటీవల దేశీయంగా ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. డజౌ నగరంలో ఓ యువతి తన ప్రియుడు ఎంత గొప్ప బహుమతి ఇస్తాడోనని భారీగా అంచనాలు వేసుకుంది. అయితే, ఆ వెర్రి ప్రేమికుడు చేతిలో ఏమీలేకుండా రావడం చూసిన సదరు ప్రేమిక ఉగ్రరూపం దాల్చింది.

అందుబాటులో ఉన్న అన్నిరకాల తిట్లు తిట్టి, ఆపై చేతికి పని కల్పించింది. తాము ఉన్నది నడిబజార్లో అన్న విషయం మర్చిపోయి ప్రియుడ్ని ఎడాపెడా వాయించేసింది. 52 సార్లు అతడిని చెంప చెళ్లుమనేలా కొట్టింది. ప్రేయసి ఎంత కొడుతున్నా అతడు మాత్రం కిక్కురుమనలేదు. తన గర్ల్ ఫ్రెండ్ ఆగ్రహాన్ని ఎంతో సహనంతో భరించిన వైనం ఓ వీడియోలో దర్శనమిచ్చింది.

ఇక తంతును మొదట్నించి చివరి వరకు స్థానికులు కోడిపందాలను చూసినట్టు చూశారు. ఆఖరికి పోలీసులు వచ్చి ఆమెను నిలువరించడంతో అతడికి కాస్త ఊరట కలిగింది. ఇంతటి సీరియస్ సిచ్యుయేషన్ లో కూడా తన ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ ప్రేమికుడు భరించలేకపోయాడు. ఆమెను వదిలిపెట్టాల్సిందిగా పోలీసులను వేడుకున్న వైనం అందరినీ కదిలించివేసింది.

China

More Telugu News