కార్తీ ఆశలన్నీ 'ఖైదీ' పైనే

  • కార్తీ కథానాయకుడిగా 'ఖైదీ'
  • తెలుగులోను రిలీజ్ చేసే ఆలోచన
  •  ఈ నెల 30వ తేదీన టీజర్ రిలీజ్  
ప్రస్తుతం కార్తీ చేతిలో రెండు వైవిధ్యభరితమైన సినిమాలు వున్నాయి. ఒక సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుంటే, మరో సినిమాకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ 'ఖైదీ' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

ఈ సినిమాలో 'ఖైదీ'గా కార్తీ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ లేదట. అయితే కథను ఫాలో అవుతూ వెళుతూ వుంటే, హీరోయిన్ లేదనే లోపం ఎక్కడా తెలియదని అంటున్నారు. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈనెల 30వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది. ఈ సినిమాతోనైనా కార్తీకి హిట్ దక్కుతుందేమో చూడాలి.
Go Back to Shorts
karthi

More Telugu News