అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెళ్లిలో అల్లు అర్జున్ సందడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెళ్లిలో అల్లు అర్జున్ సందడి

  • బన్నీ పాదాలకు నమస్కరించిన కొత్త జంట
  • మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన స్టయిలిష్ స్టార్
  • హైదరాబాద్ లో పెళ్లి వేడుక
టాలీవుడ్ హీరోల్లో ఎంతో సహృదయుడిగా అల్లు అర్జున్ కు మంచి పేరుంది. ఆ పేరుకు తగ్గట్టుగానే ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెళ్లికి పిలవగానే వెళ్లారు. టాలీవుడ్ లో సహాయ నృత్యదర్శకుడిగా పనిచేస్తున్న శిరీష్ వివాహం హైదరాబాద్ లో శుక్రవారం జరిగింది. శిరీష్ తన పెళ్లికి బన్నీని కూడా ఆహ్వానించాడు. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా బన్నీ తీరిక చేసుకుని వివాహానికి విచ్చేశారు.

ఈ టాలీవుడ్ అగ్రహీరో రాకతో పెళ్లిమంటపం వద్ద ఆనందోత్సాహాలు మిన్నంటాయి. వధూవరులు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అల్లు అర్జున్ ను చూసి ఉబ్బితబ్బిబ్బయిపోయారు. ఈ సందర్భంగా బన్నీకి కొత్త జంట పాదాభివందనం చేయగా, బన్నీ వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనంతరం, వధూవరులు, వారి బంధుమిత్రులతో అల్లు వారబ్బాయి ఫొటోలకు పోజులిచ్చారు.

కాగా, పెళ్లికొడుకు శిరీష్ సినిమాలపై మోజుతో హైదరాబాద్ రాగా, బన్నీ తమ గీతా ఆర్ట్స్ లోనే పని కల్పించారు. అసిస్టెంట్ బాయ్ గా ఉన్న శిరీష్ లో డ్యాన్స్ టాలెంట్ ఉందని గ్రహించిన బన్నీ అతడికి మెరుగైన శిక్షణ ఇప్పించారు. ఇవాళ శిరీష్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడంటే అది బన్నీ చలవే అని చెప్పాలి.
Allu Arjun
Tollywood

More Telugu News