Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు కొంచెం కోపం ఎక్కువ .. నిర్మాతగా నేను కరెక్ట్ కాదు: నటుడు జాకీ

  • నిర్మాతల కష్టాలు చూస్తూ వస్తున్నాను 
  • నిర్మాణంలోని టెన్షన్స్ నాకు తెలుసు
  •  నా మాట తీరు కొందరికి నచ్చకపోవచ్చు 
ఎన్నో సీరియల్స్ లో నటించిన అనుభవం జాకీ సొంతం. తన బాడీ లాంగ్వేజ్ తోను .. డైలాగ్ డెలివరీతోను జాకీ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. 'టీవీ సీరియల్స్ నిర్మాణంలోకి అడుగుపెట్టొచ్చు గదా?' అనే ప్రశ్న ఆయనకి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. " సీరియల్స్ నిర్మాణం అనేది అంత తేలికైన విషయం కాదు. అందులో ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. ప్రతి రోజు మేము చూస్తూనే ఉంటాము గనుక మాకు తెలుస్తుంది.

పైగా నాకు కొంచెం కోపం ఎక్కువ .. ముక్కు సూటిగా మాట్లాడుతూ వుంటాను. అది కొంతమందికి నచ్చొచ్చు .. మరికొంతమందికి నచ్చకపోవచ్చు. సీరియల్ ఎక్కువ కాలం రన్ అయితే .. అందరికీ ఎక్కువ రోజులు అన్నం దొరుకుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే నేను మాట్లాడతాను. అలా ఉన్నదున్నట్టుగా మాట్లాడటం నాలోని మైనస్ అని కొంతమంది చెబుతుంటారు" అని అన్నాడు. 
jackie

More Telugu News