చంద్రబాబు గెలవడమే గొప్ప.. అసలు ఆయన ఎలా గెలిచాడో!: నాదెండ్ల భాస్కరరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు గెలవడమే గొప్ప.. అసలు ఆయన ఎలా గెలిచాడో!: నాదెండ్ల భాస్కరరావు

  • చంద్రబాబు ఎలా గెలిచారో!
  • చంద్రబాబుపై  ప్రజల్లో వ్యతిరేకత ఉంది
  • జగన్ సీఎం అవుతారని ఊహించా
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం, టీడీపీకి అన్ని సీట్లు రావడమే గొప్పని, అసలు, ఆయన ఎలా గెలిచాడో! అంటూ ప్రముఖ రాజకీయ వేత్త, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు సెటైర్లు విసిరారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జగన్ సీఎం అవడానికి కారణం ప్రజల్లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతేనని అన్నారు. చంద్రబాబు కులపక్షపాతిగా వ్యవహరించారన్న ప్రచారం ప్రజల్లో బాగా ఉందని అన్నారు. ప్రభుత్వమే అబద్ధాలు చెబితే ప్రజలు ఇంకెవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. జగన్ సీఎం అవుతారని మీరు ఊహించారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘ఎక్స్ పెక్ట్ చేశాను’ అని చెప్పారు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మీ అభిప్రాయమేంటని నాదెండ్ల భాస్కరరావును ప్రశ్నించగా, పవన్ ని తానెప్పుడూ చూడలేదని, తననెప్పుడూ ఆయన చూడలేదని, మేమిద్దరం ఎప్పుడూ మాట్లాడుకోలేదని అన్నారు. తెనాలి నుంచి పోటీ చేసిన తన కుమారుడు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఓటమిపై గురించి అడగగా, ఈ వేవ్ లో కొట్టుకుపోయాడని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Chandrababu
nadendal bhasker rao

More Telugu News