లోక్‌సభ రద్దు చేస్తూ నేడు కేబినెట్ తీర్మానం...అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు
- ఈ రోజు ప్రధాని కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం
- సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ
- సొంతంగానే అవసరమైన మెజార్టీ సాధించిన కమలనాథులు
ఈరోజు సాయంత్రం ప్రధాని కార్యాయంలోని సౌత్‌బ్లాక్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుతం నడుస్తున్న 16వ లోక్ సభను రద్దుచేస్తూ తీర్మానం చేయనున్నారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి జూన్ 3 వరకు ఉంది. రెండు రోజుల్లో ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతితో సమావేశమై లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన అభ్యర్థుల జాబితా అందజేస్తారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు.