వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా రానున్న కేసీఆర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా రానున్న కేసీఆర్!

  • ఈ నెల 30న జగన్ ప్రమాణ స్వీకారం
  • అతిథిగా రావాలని కేసీఆర్ కు ఆహ్వానం
  • సానుకూలంగా స్పందించిన టీఆర్ఎస్ అధినేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఆ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని విశ్వసనీయ సమాచారం. విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఇప్పటికే జగన్ నుంచి కేసీఆర్ కు ఆహ్వానం అందినట్టు సమాచారం. దీనికి కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందిస్తూ, తాను తప్పకుండా వస్తానని చెప్పినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం అధికారులను కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.
KCR
YSRCP
Jagan
Oath
Andhra Pradesh

More Telugu News