అద్వానీ రికార్డును బద్దలు కొడుతూ అమిత్ షా ఘనవిజయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అద్వానీ రికార్డును బద్దలు కొడుతూ అమిత్ షా ఘనవిజయం

  • అమిత్ షాకు 5.11 లక్షల ఓట్ల మెజారిటీ
  • కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డాను ఓడించిన బీజేపీ చీఫ్
  • కొనసాగుతున్న బీజేపీ హవా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లోక్ సభ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ పేరిట ఉన్న అత్యధిక మెజారిటీ రికార్డును తిరగరాస్తూ కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డాపై రికార్డు విక్టరీ నమోదు చేశారు. అద్వానీ గతంలో 4.83 లక్షల మార్జిన్ తో గెలుపొందగా, అమిత్ షా 5.11 లక్షల మార్జిన్ తో సరికొత్త రికార్డు సృష్టించారు. తాజా విజయంతో అమిత్ షా కూడా లోక్ సభలో అడుగుపెట్టనున్నారు. కాగా, జాతీయ స్థాయిలో ట్రెండ్స్ చూస్తే ఎన్డీయే 351 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, యూపీఏ 89 స్థానాల్లో ఎదురీదుతోంది. ఇతరులు 102 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
Amit Shah
BJP

More Telugu News