జగన్కు నా శుభాకాంక్షలు... చంద్రబాబుకు నా సానుభూతి: రామ్గోపాల్ వర్మ
- జగన్ అఖండ విజయం సాధించబోతున్నారు
- యాత్ర, ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి సినిమాను ఆదరించిన స్థాయిలోనే విజయం
- సర్వే చేసిన లగడపాటిపైనా సెటైర్
రాజశేఖరరెడ్డి పాదయాత్రపై తీసిన ‘యాత్ర’ సినిమా, ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తీసిన ‘ఎన్టీఆర్’ సినిమాలకు లభించిన ఫలితాలకు తగ్గట్టుగానే అసెంబ్లీ ఫలితాలు కూడా ఉన్నాయని చమత్కరించారు. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్పైనా సెటైర్ వేశారు. ఆయనను ఎవరో బలవంతంగా తీసుకువెళ్తున్నట్లు ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ దాని కింద ’ఇంకెప్పుడూ సర్వే చేయను, నన్ను వదిలేయండి’ అని లగడపాటి అన్నట్లు రాశారు.