13 చోట్ల తొలి రౌండ్ పూర్తి... వైసీపీ 10, టీడీపీ 3 చోట్ల లీడ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

13 చోట్ల తొలి రౌండ్ పూర్తి... వైసీపీ 10, టీడీపీ 3 చోట్ల లీడ్

  • 11 చోట్ల ముగిసిన తొలిరౌండ్ కౌంటింగ్
  • ఆధిక్యం చూపిస్తున్న వైఎస్ఆర్ సీపీ
  • ఆధిక్యంలో లోకేశ్, చినరాజప్ప
ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికారులు తొలి రౌండ్ కౌంటింగ్ ను పూర్తి చేయగా, తెలుగుదేశం పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో సాగుతోంది. వైసీపీ నుంచి మైదుకూరులో ఎస్ రఘురామిరెడ్డి, నెల్లూరు టౌన్ లో పోలుబోయిన అనిల్ కుమార్, కడపలో షేక్ అంజాద్ బాషా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్, మచిలీపట్నంలో పేర్ని నాని (వెంకట్రామయ్య), అరకులో చెట్టి ఫాల్గుణ, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టెక్కలి నుంచి పేరాడ తిలక్, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు ఆధిక్యంలో ఉన్నారు.

ఇదే సమయంలో టీడీపీ తరఫున పెద్దాపురం నుంచి బరిలోకి దిగిన నిమ్మకాయల చినరాజప్ప, మంగళగిరిలో నారా లోకేశ్, రాజమహేంద్రవరం నుంచి ఆదిరెడ్డి భవాని ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకూ 13 నియోజకవర్గాల్లో తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగా, వైసీపీ 10, టీడీపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Counting
YSRCP
Telugudesam

More Telugu News