సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రకుల్ బాలీవుడ్ లో సెటిల్ అవుతుందా?
  • పారిస్ వెళ్లిన విజయ్ దేవరకొండ 
  • సూర్య చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్  
*  తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడిక బాలీవుడ్ లో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం 'దే దే ప్యార్ దే' బాక్సాఫీసు వద్ద విజయం సాధిస్తున్న సందర్భంగా అక్కడి మీడియా ఆమె గురించి బాగా రాస్తోంది. దీనికి తోడు పలువురు హీరోలు, నిర్మాతలు కూడా రకుల్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. దీనిని బట్టి త్వరలోనే రకుల్ బాలీవుడ్ లో మంచి పొజిషన్ కి చేరవచ్చని అంటున్నారు.
*  విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తాజా షెడ్యూల్ పారిస్ లో జరుగుతుంది. ఇందుకోసం విజయ్ నిన్న పారిస్ కు బయలుదేరాడు. అక్కడ మేజర్ షెడ్యూల్ ను నిర్వహించనున్నారు. రాశిఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
*  తమిళ కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం 'ఎన్.జి.కే' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 28 సాయంకాలం హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించారు.
Rakul
vijay
Rashikhanna
Surya

More Telugu News