‘మ్యాన్ బుకర్ ప్రైజ్’ అందుకున్న ఒమన్ రచయిత్రి జోఖా అల్హార్తి
- ఇంత వరకూ ఏ అరబిక్ రచయితకు దక్కని పురస్కారం
- ‘సెలెస్టియల్ బాడీస్’ నవలా రచయిత్రి జోఖా
- ఆ నవలను ఆంగ్లంలోకి అనువదించిన మేరిలిన్ బూత్
ఇంత వరకూ ఏ అరబిక్ రచయితకు దక్కని అత్యున్నత పురస్కారం దక్కించుకున్న జోఖా అల్హార్తి వయసు నలభై ఏళ్లు. ఈ పురస్కారం అందుకున్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, అరబిక్ సంస్కృతిని తెలిపే ఓ ద్వారం తెరచుకుందని, చాలా థ్రిల్ గా ఉందని అన్నారు. కాగా, రచయిత్రి జోఖా అల్హార్తి గురించి చెప్పాలంటే.. ఇప్పటి వరకూ ఆమె అరబిక్ భాషలో మూడు నవలలు రాశారు. పిల్లల కోసం ఆమె పుస్తకాలు రాస్తుంటారు.