Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా ఫ్లాప్ సినిమాలు గుర్తుచేసుకుని ఒళ్లు దగ్గర పెట్టుకుంటాను: దర్శకుడు తేజ

  • అనూప్ మంచి సంగీతాన్ని అందించాడు
  •  సినిమాటోగ్రఫీ జోలికి వెళ్లలేదు 
  • నేను తీసిన హిట్ ను గుర్తుతెచ్చుకోను 
తేజ దర్శకత్వంలో రూపొందిన 'సీత' ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్ - బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటించిన ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో తేజ మాట్లాడారు. "ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇంతకుముందు నేను సినిమాటోగ్రాఫర్ గా చేశాను. కానీ 'సీత' దగ్గరికి వచ్చేసరికి ఆ బాధ్యతను వేరేవారికి అప్పగించాను.

ఎందుకంటే ఒకేసారి దర్శకత్వం - సినిమాటోగ్రఫీ అనే రెండు బాధ్యతలను నిర్వహించడమంటే నాకు భయం. ఒక పనే సరిగ్గా చేయడం చేతగాదు .. మళ్లీ రెండో పని ఎందుకు? అని కూడా అనుకుంటాను. నేను ఒక హిట్ తీశాను గదా అని దాన్ని పట్టుకుని వేళ్లాడను. 'నేనే రాజు నేనే మంత్రి' అనే హిట్ తీశాను గదా అనేది నేను గుర్తుపెట్టుకోను. అంతకుముందు తీసిన ఫ్లాప్ సినిమానే గుర్తుపెట్టుకుంటాను. అప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయడానికి అవకాశం ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. 
kajal
bellamkonda

More Telugu News