తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
- రేపటి నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
- జూన్ 3 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం
- జూలై 1 నుంచి ప్రారంభం కానున్న తరగతులు
ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలతో పాటు రీ వెరిఫికేషన్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించడంతో నోటిఫికేషన్ను వాయిదా వేసింది. తిరిగి నోటిఫికేషన్ను నేడు విడుదల చేసింది. మూడు విడతలలో సీట్ల కేటాయింపు అనంతరం జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.