50 కోట్లు రాబట్టేసిన రకుల్ హిందీ మూవీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

50 కోట్లు రాబట్టేసిన రకుల్ హిందీ మూవీ

  • ఈ నెల 17న విడుదలైన 'దే దే ప్యార్ దే'
  • రెండో రోజు నుంచి పుంజుకున్న వసూళ్లు
  •  రకుల్ గ్లామర్ కి మంచి మార్కులు
తెలుగులో అవకాశాలు తగ్గుతూ ఉండటంతో, తమిళ .. హిందీ భాషాల్లో క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నాలను రకుల్ గట్టిగానే చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె అజయ్ దేవగణ్ సరసన నాయికగా 'దే దే ప్యార్ దే' సినిమా చేసింది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను దేశవ్యాప్తంగా 3100 స్క్రీన్లలో విడుదల చేశారు.

తొలి రోజున ఈ సినిమా 10.41 కోట్లను మాత్రమే రాబట్టడంతో రకుల్ డీలాపడింది. అయితే రెండవ రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకోవడంతో రకుల్ మనసు కుదుటపడింది. నిన్నటితో ఈ సినిమా 50 కోట్ల మార్క్ ను అందుకోవడంతో, రకుల్ తేలికగా ఊపిరి పీల్చుకుందట. రకుల్ గ్లామర్ కి ఎక్కువ మార్కులు పడుతుండటం ఆమెకి మరింత సంతోషాన్ని కలిగిస్తోందట. మరి రకుల్ ఆశించినట్టుగానే వరుసగా అక్కడ అవకాశాలు వస్తాయేమో చూడాలి. 
rakul

More Telugu News