అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం.. రేపు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభిస్తాం!: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్
- ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తాం
- ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 36 టేబుల్స్ ఏర్పాటు
- హైదరాబాద్ లో మీడియాతో రజత్ కుమార్
‘ఐదు వీవీప్యాట్లు సెలెక్ట్ చేసి వాటిని ఈవీఎం లెక్కలతో సరిచూస్తాం. కౌంటింగ్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశాం. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తాం. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. కౌంటింగ్ సందర్భంగా 6,745 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు’ అని రజత్ కుమార్ తెలిపారు. ఈవీఎంల్లో పడ్డ ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పుల మధ్య తేడా రాదని స్పష్టం చేశారు.