ఒక తప్పుకు ఆరుగురు బలి... సొంత హెలికాప్టర్ ను కూల్చేసిన భారత వాయుసేన మిసైల్!
- ఫిబ్రవరి 27న గాల్లోనే పేలిపోయిన చాపర్
- ఆరుగురు దుర్మరణం
- కిందనుంచి వదిలిన 'స్పైడర్' కారణమని తేల్చిన అధికారులు
ఈ కేసులో ఎయిర్ బేస్ లోని ఉద్యోగులపై మిలటరీ చట్టాల కింద శిక్షించదగిన హత్యా నేరం (కల్పబుల్ హోమిసైడ్) ఆరోపణలను నమోదు చేయనున్నామని అధికారులు తెలిపారు. గాల్లోకి టేకాఫ్ తీసుకున్న చాపర్ లోని వారికి తమను ఓ మిసైల్ వెంబడిస్తోందన్న విషయం కూడా తెలియదని, భూ ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను పేల్చేయగల ఈ 'స్పైడర్' తన టార్గెట్ ను ఎందుకు మార్చుకుందన్న విషయమై లోతైన విచారణ జరుగుతుందని అధికారులు అన్నారు.