నగ్న చిత్రాలు పంపాలని కోరిన ట్రోలర్... మారు మాట్లాడకుండా చేసిన గాయని చిన్మయి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నగ్న చిత్రాలు పంపాలని కోరిన ట్రోలర్... మారు మాట్లాడకుండా చేసిన గాయని చిన్మయి!

  • వైరముత్తుపై 'మీటూ' ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కిన చిన్మయి
  • తాజాగా 'న్యూడ్స్' పంపాలని కోరిన ట్రోలర్
  • లిప్ స్టిక్, ఐబ్రో పెన్సిల్స్ పోస్ట్ చేసిన చిన్మయి
తమిళ గేయ రచయిత వైరముత్తుపై 'మీటూ' ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కిన గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి, ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. నెట్టింట తనను వేధించాలని చూసేవారికి తనదైన శైలిలో పంచ్ లు ఇస్తుండే ఆమె, ఓ ట్రోలర్ కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. తనకు కొన్ని నగ్న చిత్రాలను (న్యూడ్స్) పెట్టాలని ఓ ట్రోలర్ కోరగా, అడిగినంత పనీ చేసింది. అయితే, న్యూడ్ చిత్రాలు పెట్టి కాదుసుమా!... 'ఇవే నా ఫేవరెట్ న్యూడ్స్' అంటూ 'న్యూడ్' సంస్థ విక్రయించే లిప్ స్టిక్, ఐబ్రో పెన్సిల్స్ బొమ్మలను పోస్ట్ చేసింది. ఇక దీన్ని చూసిన ఎంతో మంది నెటిజన్లు, చిన్మయి సమయస్ఫూర్తితో వ్యవహరించిందని, దీంతో ఆ ట్రోలర్ ఇక ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొందని కామెంట్లు చేస్తున్నారు.



Chinmayee
Nudes
Trollers

More Telugu News