అమెరికా, ఇంగ్లండ్ పత్రికలు మోదీపై విషం కక్కుతున్నాయి!: ఐవైఆర్ కృష్ణారావు ఫైర్
- ప్రధానిని ఇవి లక్ష్యంగా చేసుకుంటున్నాయి
- బలమైన భారత్ విదేశాలకు కంటగింపు
- ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మాజీ సీఎస్
ఈరోజు ట్విట్టర్ లో ఐవైఆర్ స్పందిస్తూ..‘అమెరికా, ఇంగ్లండ్ పత్రికలు మోదీ గారి మీద విషం కక్కుతున్నాయి. టైమ్స్, ఎకానమిస్ట్, తాజాగా గార్డియన్. మోదీగారే దేశానికి సరైన వ్యక్తి అని ఇంతకన్నా పెద్ద సాక్ష్యం మనకు అవసరం లేదు. పాశ్చాత్య పత్రికలకు బలమైన భారతదేశం ఏనాడు ఒక ఎజెండా కాదు. ఇంత కన్నా భిన్నంగా వాళ్లు రాస్తారని అనుకోలేదు’ అని ట్వీట్ చేశారు.