మాక్ పోలింగ్ ఓట్లను తొలగించడం మరచిన అధికారులు.. కవర్ చేసుకునేందుకు అసలు ఓట్ల తొలగింపు!
- పోలింగ్‌కు గంట ముందు మాక్ పోలింగ్
- డిలీట్ చేయకుండానే పోలింగ్ కొనసాగింపు
- 20 మందిపై క్రమశిక్షణ చర్యలు
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఈవీఎంలు సరిగా పనిచేస్తున్నాయో, లేదో తెలుసుకునేందుకు పోలింగ్‌కు గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 50 ఓట్లు వేసి వాటిని పరీక్షిస్తారు. అనంతరం పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో వాటిని డిలీట్ చేస్తారు. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన చివరి విడత ఎన్నికల్లో ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ టెస్ట్ ఓట్లను తొలగించడాన్ని అధికారులు మర్చిపోయారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని అసలు ఓట్లను తొలగించారు. విషయం వెలుగులోకి రావడంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.