Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానాన్ని ఆటో పైలట్ లో పెట్టి పాడుపని... ఐదేళ్ల శిక్షకు గురికానున్న మల్టీ మిలియనీర్!

  • 15 ఏళ్ల బాలికతో శృంగారం
  • అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
  • నేరాన్ని అంగీకరించిన స్టీఫెన్ బ్రాడ్లీ మెల్
ఆయన సంఘంలో మంచిపేరున్న కోటీశ్వరుడు. సొంతంగా విమానాలు కొని, వాటిని పేదల ఆరోగ్య అవసరాల నిమిత్తం ఉచితంగా ఇస్తూ, 'ఎయిర్ లైఫ్‌ లైన్' అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. అయితేనేం, అతని బుద్ధి వక్రించింది. తన వద్దకు విమానాలు నడపడం నేర్చుకునేందుకు వచ్చిన 15 ఏళ్ల బాలికపై విమానంలోనే అత్యాచారం చేశాడు. కోర్టు ముందు నేరం అంగీకరించడంతో అతనికి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష తప్పదని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, అమెరికాకు చెందిన మల్టీ మిలియనీర్, స్టీఫెన్ బ్రాడ్లీ మెల్ (53), విమానం గాల్లో ఉండగా ఆటోపైలట్ మోడ్‌ లో పెట్టి 15 ఏళ్ల మైనర్‌ ను రేప్ చేశాడు. బాధితురాలి తల్లి కుమార్తెకు ఫ్లైయింగ్ పాఠాలు నేర్పాలని అతన్ని కలువగా, ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడికి వివాహమై, ముగ్గురు పిల్లలు ఉండగా, తన కూతురి వయసు కన్నా తక్కువ వయసున్న బాలికతో ఇలా చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.

2017, జూలై 20న మైనర్ బాలికతో కలిసి, తన ప్రైవేట్ జెట్‌ విమానంలో సోమర్‌ సెట్ నుంచి బ్రాంస్టేబుల్ వరకు ప్రయాణించిన బ్రాడ్లీ, తిరుగు ప్రయాణంలో విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌ లో పెట్టి శృంగారంలో మునిగిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్టీఫెన్‌ ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచగా, తన నేరాన్ని స్టీఫెన్ అంగీకరించాడు. కాగా, తమ క్లయింట్ సంఘంలో ఎంతో మంచి పేరున్న వ్యక్తని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడని, అతన్ని క్షమించి వదిలివేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.
USA
Flight
Automode
Auto Pilot
Rape
Minor

More Telugu News