మోదీని సినిమా ఇండస్ట్రీకి పంపిస్తాం: సీపీఐ నారాయణ
- బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు
- సినిమాల్లో మోదీ వేషాలు వేసుకోవాల్సిందే
- ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మమతాను బెదిరించారు
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి భారీగా సీట్లు తగ్గుతాయని జోస్యం చెప్పారు. తమతోనే కలిసి ఉండకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మోదీ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి మోదీ బెదిరింపులకు భయపడలేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.