కొడుకు ప్రేమించి వదిలేసిన యువతికి వేరొక యువకుడితో పెళ్లి చేసి యావదాస్తిని రాసిచ్చిన తండ్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొడుకు ప్రేమించి వదిలేసిన యువతికి వేరొక యువకుడితో పెళ్లి చేసి యావదాస్తిని రాసిచ్చిన తండ్రి

  • తిరునక్కారంలో కొడుకుతో కలిసి ఉంటున్న షాజీ
  • మేజర్లు అయ్యాక పెళ్లి చేస్తానని మాటిచ్చాడు
  • ఇంటి నుంచి గెంటేసిన యువతి తల్లిదండ్రులు
  • రాజీ చేసేందుకు ప్రయత్నించిన తండ్రి
కొడుకు మోసం చేసి వదిలేసిన యువతికి అతని తండ్రి అండగా నిలిచాడు. వేరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి తన యావదాస్తిని ఆ యువతి పేరిట రాసిచ్చి కొడుకుకి షాక్ ఇచ్చాడు. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా తిరునక్కారం గ్రామంలో నివసిస్తున్న షాజీ కొడుకు ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. విషయం షాజీకి తెలియడంతో వారిద్దరు మైనర్లు కావడంతో కొంతం కాలం తరువాత పెళ్లి చేస్తానని మాటిచ్చాడు.

అయితే షాజీ కుమారుడికి ఈ మధ్య కాలంలో మరో యువతితో పరిచయం ఏర్పడింది. దీనిని అతని మొదటి ప్రియురాలు నిలదీయడంతో ఆమెను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఈ విషయం ఊరంతా తెలియడంతో యువతి తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. విషయం తెలుసుకున్న షాజీ, కొడుకును, అతని మొదటి ప్రియురాలిని కూర్చోబెట్టి రాజీ ప్రయత్నం చేశాడు.

కానీ కొడుకు ససేమిరా అనడంతో యువతికి న్యాయం చేయాలని షాజీ నిర్ణయించుకున్నాడు. ఆయనే స్వయంగా ఓ యువకుడికి ఇచ్చి ఆమెకు వివాహం చేసి తన యావదాస్తిని ఆమె పేరు మీద రాసి కొడుకుకు షాక్ ఇచ్చాడు.  
Shaji
Kerala
Thirunakkaram
Marriage

More Telugu News