రాజన్న సుపరిపాలన సిద్ధించడమే ఇక నా సంకల్పం: వైఎస్ జగన్

  • ‘ప్రజాపరిపాలనే సాగాలి’ అనే క్యాప్షన్ తో పోస్టర్ విడుదల
  • ఈ పోస్టర్ లో నవ్వుతూ మైకు పట్టుకుని ఉన్న జగన్
  • మండు టెండల్ని సైతం లెక్కజేయకుండా ప్రజలు ఓట్లేశారు
ఏపీలో వైసీపీ గెలుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. తమ అధినేత జగన్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ నేతలు పదేపదే జోస్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఓ ఆసక్తికర పోస్టర్ ను పోస్ట్ చేశారు. రాజన్న సుపరిపాలనను తీసుకురావాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు.

ఈ పోస్టర్ లో నవ్వుతూ మైకు పట్టుకుని జగన్ ఉండటం గమనించవచ్చు. ప్రజాస్వామ్యంలో ‘ప్రజాపరిపాలనే సాగాలి’ అనే క్యాప్షన్ తో ఉన్న ఈ పోస్టర్ పై మండు టెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారని, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారని, వారి ఆశీస్సులు అందిన వేళ వారికి బాధ్యుడినై ఉంటానని రాశారు. 
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
ys jagan
exit-polls

More Telugu News