తేజ వంటి గొప్ప దర్శకుడితో పనిచేస్తానని అనుకోలేదు: బెల్లంకొండ శ్రీనివాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తేజ వంటి గొప్ప దర్శకుడితో పనిచేస్తానని అనుకోలేదు: బెల్లంకొండ శ్రీనివాస్

  • సినిమా అంటే నాకు ప్రాణం 
  • తేజ వంటి దర్శకుడిని చూడలేదు
  • 'సీత' హిట్ కావడం ఖాయం  
బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందిన 'సీత' .. ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ .. "సినిమా అంటే నాకు ప్రాణం .. అలాంటి సినిమా కోసం నేను ఎంతకష్టమైనా పడతాను. ఇంతవరకూ నేను హీరో అంటే ఆరంభంలోనే కనిపించాలి .. అదీ యాక్షన్ సీన్ తోనే ఎంట్రీ ఇవ్వాలని అనుకునేవాడిని. అలాంటి నా ఆలోచనా విధానాన్ని ఈ సినిమాతో తేజ గారు మార్చేశారు.

ఇంతటి ప్యాషన్ వున్న దర్శకుడిని ఇంతవరకూ చూడలేదు. ఆరో సినిమాకే ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాలో నేను 'రఘురామ్' అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది. ఈ సినిమా మా అందరికీ విజయాన్ని అందించడం ఖాయం" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
kajal
bellamkonda

More Telugu News