ఆరెస్సెస్ నేతతో నితిన్ గడ్కరీ భేటీ.. కలకలం!
- భయ్యాజీ జోషితో గడ్కరీ సమావేశం
- రెండు గంటలు కొనసాగిన మీటింగ్
- ఆరెస్సెస్ తో గడ్కరీకి సన్నిహిత సంబంధాలు
ఇదే సమావేశంలో పాల్గొన్న మరో బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగిందని చెప్పారు. మరోవైపు 'పీఎం నరేంద్ర మోదీ' చిత్రం పోస్టర్ విడుదల సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, ప్రధాని రేసులో తాను లేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మోదీ నాయకత్వంలోనే తాము ఎన్నికల ప్రచారానికి వెళ్లామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ జోషితో గడ్కరీ సమావేశం కొత్త చర్చకు దారి తీసింది.