​ఎగ్జిట్ పోల్స్: తమిళనాట తిరుగులేని డీఎంకే!​.. క్లీన్ స్వీప్ చేస్తుందంటున్న 'ఇండియాటుడే'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

​ఎగ్జిట్ పోల్స్: తమిళనాట తిరుగులేని డీఎంకే!​.. క్లీన్ స్వీప్ చేస్తుందంటున్న 'ఇండియాటుడే'!

  • డీఎంకే పార్టీకి 34 నుంచి 38 స్థానాలు
  • అన్నాడీఎంకే సున్నా నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం!
  • తమిళనాడులో మొత్తం లోక్ సభ స్థానాలు 38
దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలు కూడా గణనీయమైన స్థాయిలో సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇండియాటుడే మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో తమిళనాడులో డీఎంకే ఎదురులేని ప్రస్థానం కొనసాగించబోతోందని తెలిపారు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 34 నుంచి 38 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఇండియాటుడే అంచనా వేసింది. ఇక అధికార అన్నాడీఎంకే దారుణమైనరీతిలో సున్నా నుంచి 4 స్థానాల వరకే పరిమితం అవుతుందని పేర్కొన్నారు. తమిళనాడులో మొత్తం 38 లోక్ సభ స్థానాలు ఉండగా, డీఎంకే క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నట్టు ఇండియాటుడే సర్వే ద్వారా అర్థమవుతోంది.
Tamil Nadu

More Telugu News