చంద్రగిరిలో రీ-పోలింగ్ అనగానే ఇంతలా వణికిపోతున్నారేంటి చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి

  • ఈసీకి దాడికి పురమాయించేంత తప్పేం జరిగింది?
  • ఓడిపోయినట్లు ఆ ఆందోళన ఎందుకు?
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రగిరిలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అనగానే చంద్రబాబు వణికిపోతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. రీపోలింగ్ అనగానే చంద్రబాబు ఓడిపోయినట్లు గంగవెర్రులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతికేళ్లుగా దళితులను టీడీపీ నేతలు ఓటింగ్ కు దూరం చేశారని ఆరోపించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘చంద్రగిరిలో 5 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్‌ అంటేనే ఇంతగా వణికిపోతున్నారేంటి చంద్రబాబూ. ఈసీపై దాడికి పురమాయించేంత తప్పేం జరిగిందని? ఏ పార్టీ ఓటర్లు ఆ పార్టీకి ఓటేస్తారు. ఓడిపోయినట్లు గంగ వెర్రులెందుకు? పాతికేళ్ళుగా దళితులను ఓటు హక్కుకు దూరం చేసిన మీ నిజస్వరూపం బయటపడినందుకా?’ అని నిలదీశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News