డబ్బింగ్ ఆర్టిస్ట్‌ రవీనాకు నటి రాశీ ఖన్నా క్షమాపణలు.. థ్యాంక్స్ చెప్పిన రవీనా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డబ్బింగ్ ఆర్టిస్ట్‌ రవీనాకు నటి రాశీ ఖన్నా క్షమాపణలు.. థ్యాంక్స్ చెప్పిన రవీనా

  • అయోగ్య సినిమాలో రాశీకి డబ్బింగ్ చెప్పిన రవీనా
  • సినిమా క్రెడిట్స్‌లో డబ్బింగ్ ఆర్టిస్టులకు దక్కని చోటు
  • రవీనా తన మధుర స్వరంతో తన పాత్రను మరింత అందంగా మలిచిందన్న రాశీ
సినిమా క్రెడిట్స్‌లో తన పేరు జోడించనందుకు ట్విట్టర్ వేదికగా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన నటి రాశీ ఖన్నా ఆమెకు క్షమాపణలు చెప్పింది. విశాల్-రాశీఖన్నా జంటగా నటించిన ‘అయోగ్య’ సినిమాలో రాశీ ఖన్నాకు రవీనా అనే యువతి డబ్బింగ్ చెప్పింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా క్రెడిట్స్‌లో డబ్బింగ్ ఆర్టిస్టులకు చోటు లభించలేదు. డ్రైవర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, సౌండ్ ఇంజినీర్లు, స్టూడియో కో-ఆర్డినేటర్లకు క్రెడిట్స్‌లో చోటు ఇచ్చినప్పటికీ డబ్బింగ్ ఆర్టిస్టులను పట్టించుకోకపోవడం బాధగా ఉందంటూ రవీనా ట్వీట్ చేశారు.

స్పందించిన రాశీ ఖన్నా.. క్రెడిట్స్‌లో డబ్బింగ్ ఆర్టిస్టులను విస్మరించినందుకు సారీ చెప్పింది. రవీనా తన మధురమైన స్వరాన్ని తనకు అరువిచ్చి తన పాత్రను మరింత అందంగా మలిచినందుకు ధన్యవాదాలని ట్వీట్ చేసింది. రాశీ ట్వీట్‌కు రవీనా స్పందిస్తూ.. థ్యాంక్స్ చెప్పింది. తమకు క్రెడిట్స్ ఇవ్వకపోవడంతో రాశీ తప్పులేదని పేర్కొన్న రవీనా.. రాశీకి డబ్బింగ్ చెప్పినందుకు ఆనందంగా ఉందని రిప్లై ఇచ్చింది.
Raasi khanna
Tollywood
Dubbing artist
Ravina

More Telugu News