పుల్వామా ఉగ్రదాడి వెనక ‘ఆమె’.. వెలుగులోకి సంచలన విషయం
- పాక్ యువతి హనీ ట్రాప్‌లో చిక్కుకున్న భారత జవాను
- అతడి నుంచి సైనిక రహస్యాలను సేకరించిన యువతి
- అతడిచ్చిన సమాచారంతోనే పుల్వామా ఆత్మాహుతి దాడి
మధ్యప్రదేశ్‌లోని మోహోలో ఉన్న బీహార్ రెజిమెంట్‌లో అవినాశ్ కుమార్ (25) నాయక్ క్లర్క్‌గా పనిచేసేవాడు. 2018లో అతడిని అసోంకు బదిలీ చేశారు. ఆ సమయంలో అతడికి ఓ పాకిస్థాన్ యువతితో వాట్సాప్ ద్వారా పరిచయం అయింది. ఆమె వలలో చిక్కుకున్న అవినాశ్ ఆమె అడిగిందే తడవుగా ముందు వెనక ఆలోచించకుండా సైనిక రహస్యాలను ఆమెకు చేరవేశాడు. వాటిని ఆమె ఉగ్రవాదులకు అందించేది.
అలా పక్కా సమాచారాన్ని సేకరించిన ఉగ్రవాదులు పుల్వామా దాడికి పక్కా పథక రచన చేసి అమలు చేశారు. అవినాశ్ బ్యాంకు ఖాతాకు పాకిస్థాన్ నుంచి రూ.50 వేలు జమ అయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అవినాశ్‌కు భోపాల్ ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది.