విజయ్ దేవరకొండతో ప్రేమలో పడినట్టుగా వస్తోన్న వార్తలపై స్పందించిన హీరోయిన్
- ఎవరి ప్రేమలోనూ పడలేదు
- అనవసరమైన పుకార్లను నమ్మకండి
- నా దృష్టి కెరియర్ పైనే వుంది
తాజాగా ఈ విషయంపై ఐశ్వర్య రాజేశ్ స్పందించింది. "నాకు ఒక ప్రేమకథ వుందనీ .. ప్రేమలో ఉన్నాననే వార్తలను కొన్ని రోజులుగా వింటున్నాను. నేను ఎవరితో ప్రేమలో పడ్డాననే విషయం కూడా తెలుసుకోవాలని వుంది" అంటూ విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించకుండానే ట్వీట్ చేసింది. నేను నిజంగానే ఎవరి ప్రేమలోనైనా పడటమంటూ జరిగితే ఆ విషయం నేనే చెబుతా. అనవసరమైన పుకార్లను నమ్మకండి. ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా కెరియర్ పైనే వుంది" అంటూ స్పష్టం చేసింది.