టైమ్స్ జాబితాలో ప్రభాస్ ను వెనక్కినెట్టిన విజయ్ దేవరకొండ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టైమ్స్ జాబితాలో ప్రభాస్ ను వెనక్కినెట్టిన విజయ్ దేవరకొండ

  • నాలుగోస్థానంలో విజయ్ దేవరకొండ
  • ప్రభాస్ కు 12వ ర్యాంక్
  • గతేడాది సెకండ్ ప్లేస్ లో ఉన్న ప్రభాస్
ప్రతిష్ఠాత్మక టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ టాప్-10లో కేవలం ఒకేఒక్క టాలీవుడ్ హీరోకు మాత్రమే స్థానం లభించింది. టైమ్స్ 2018కి గాను టాప్50 సెలబ్రిటీలతో మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా విడుదల చేసింది. ఈ లిస్టులో తెలుగు యువ హీరో విజయ్ దేవరకొండ నాలుగోస్థానంలో నిలిచాడు. ప్రథమస్థానం బాలీవుడ్ నయా సెన్సేషన్ విక్కీ కౌశల్ కు లభించింది. ద్వితీయస్థానంలో భారత ఫుట్ బాల్ ప్లేయర్, మోడల్ ప్రథమేశ్ మౌలింకర్ కు ఉన్నాడు. మూడో స్థానంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నారు.

ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు పతనమై ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచాడు. కాగా, టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ కు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో 12వ ర్యాంక్ ఇచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2017 సంవత్సరానికి గాను ప్రభాస్ కు ఇదే జాబితాలో సెకండ్ ర్యాంక్ లభించింది. తెలుగు చిత్రసీమ నుంచి రానా దగ్గుబాటి కూడా ఈ జాబితాలో ఉన్నాడు. గతేడాది 7వ ర్యాంక్ లో ఉన్న రానాకు ఈసారి 19వ ర్యాంక్ ఇచ్చారు.
Prabhas
Vijay Devarakonda

More Telugu News