మంగళగిరిలో గెలుపు కోసం లోకేశ్ రూ.150-200 కోట్లు పంచారు!: ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణ
- ఐఫోన్లు, టూవీలర్లు, ఏసీలు ఇష్టానుసారం పంచారు
- మంగళగిరి ఫలితాలపై ఎన్నారైలు వాకబు చేస్తున్నారు
- ఓ వీడియోను విడుదల చేసిన వైసీపీ ఎమ్మెల్యే
టీడీపీ ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా జగన్ ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్న నిరుపేదలు, యువత, సామాన్యుల ఆకాంక్షల ముందు నిలబడవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. ఓ నిరుపేద పెద్దావిడ వచ్చి తనకు రూ.వెయ్యి ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం, ఇతర కారణాలతోనే ఈ విషయాన్ని ముందుకు తీసుకురాలేకపోయానని చెప్పారు.
ఇందుకు క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. మంగళగిరి ఫలితాలపై పలువురు ఎన్నారైలు కూడా తనను వాకబు చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి అసెంబ్లీ స్థానంతో పాటు గుంటూరు లోక్ సభ సీటు నుంచి కూడా వైసీపీ జెండానే ఎగురుతుందని జోస్యం చెప్పారు.