జోరు పెంచిన ఎన్నికల సంఘం.. నేడు విజయవాడలో కౌంటింగ్ పై శిక్షణా కార్యక్రమం!
- హాజరుకానున్న లోక్ సభ, అసెంబ్లీ ఆర్వోలు
- ఉదయం పదిన్నర నుంచి 11.30 గంటల వరకూ శిక్షణ
- హాజరు కానున్న ద్వివేది, సుజాత శర్మ
వీరితో పాటు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాత శర్మ కూడా పాల్గొంటారు. ఈ నెల 23న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలుత ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ ఆర్వోలకు కౌంటింగ్ పై శిక్షణ ఇస్తామని ఈసీ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఆ తర్వాత 11.30 నుంచి 12 గంటల వరకూ ఈటీపీబీఎస్ పై శిక్షణ ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సమావేశ ప్రాంగణంలో మోడల్ కౌంటింగ్ కేంద్రం సందర్శన ఉంటుందని వ్యాఖ్యానించారు.