గింగిరాలు తిరుగుతూ.. హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్

  • అదే సమయంలో నదిలో బోటు
  • తప్పిన పెను ప్రమాదం
  • హెలికాప్టర్‌లో చిక్కుకున్న ఇద్దరిని రక్షించిన బోటు సిబ్బంది
న్యూయార్క్‌లోని హడ్సన్ నది మీదుగా వెళ్తున్న ఓ హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోయింది. మాన్‌హట్టన్ నుంచి  టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్ కూలిపోగా అందులో ఉన్న ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. హడ్సన్ నది మీదుగా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తడంతో గాలిలో అది గింగిరాలు తిరిగింది. క్రమంగా  కిందికి జారుతూ వచ్చింది. అదే సమయంలో కింది నుంచి ఓ బోటు ప్రయాణిస్తుండడంతో అందరూ హడలిపోయారు. అయితే, బోటుకు కొంత దూరంలో హెలికాప్టర్ కూలడంతో పెను ప్రమాదం తప్పింది.

పెద్ద శబ్దంతో హెలికాప్టర్ కూలిన వెంటనే బోటులోని వారు స్పందించి అందులో చిక్కుకున్న ఇద్దరినీ రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రాణనష్టం ఏమీ లేదని, పైలట్‌ సహా మరొకరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
helicopter
Hudson River
Manhattan
America

More Telugu News