Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తూనే వున్నాయి: హీరోయిన్ చార్మీ

  • 13 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను 
  • ఇంతవరకూ 55 సినిమాల్లో చేశాను
  •  చిత్ర నిర్మాణంపైనే పూర్తి దృష్టిపెట్టాను
తెలుగు తెరకి గ్లామర్ ను పరిచయం చేసిన కథానాయికలలో చార్మీ ఒకరు. అందాల కథానాయికగా కుర్రకారు హృదయాలను దోచుకున్న చార్మీ, ఆ తరువాత హఠాత్తుగా నటనకు కామా పెట్టేసి నిర్మాణం వైపు దృష్టి పెట్టింది. రేపు చార్మీ పుట్టిన రోజు .. ఈ  సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది.

"13 ఏళ్ల వయసులోనే నేను సినిమాల్లోకి వచ్చాను .. అన్ని భాషల్లోను కలుపుకుని ఇంతవరకూ 55 సినిమాల్లో నటించాను. కెరియర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు చూశాను. కథానాయికగా నేను కొనసాగించిన నా కెరియర్ పట్ల సంతృప్తిగానే వున్నాను. ఇప్పటికీ తమ సినిమాల్లో చేయమంటూ నాకు చాలామంది అవకాశాలు ఇస్తున్నారు. కానీ నేను సున్నితంగా తిరస్కరిస్తూ, నిర్మాణం పైనే దృష్టి పెడుతున్నాను. ప్రస్తుతం మా నుంచి రానున్న 'ఇస్మార్ట్ శంకర్' ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. ఆకాశ్ పూరితో మూవీ త్వరలోనే ఉంటుంది" అని చెప్పుకొచ్చింది.
charmi

More Telugu News